మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు నకిలీ విత్తనాలు అమ్మే ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెల్లంపల్లి రెండో పట్టణ ఎస్సై భాస్కర్‌రావు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో నాలుగు బస్తాల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. లక్షెట్టిపేట మండలం ఇటికాల గ్రామానికి చెందిన తాతినేని శ్రీనాథ్ ఇచ్చిన సమాచారంతో భీమిని మండలం రాంపూర్‌తో పాటు.. తాండూరులో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో నకిలీ పత్తి విత్తనాలతో పాటు.. 168 లీటర్ల నకిలీ గడ్డిమందు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రూ.25 లక్షల 14వేల విలువ చేసే పత్తి విత్తనాలు, రూ.78 వేల విలువ చేసే నకిలీ గడ్డిమందు, లక్షా 25వేల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నకిలీ విత్తనాలు, గడ్డి మందు అమ్మి రైతులను మోసం చేస్తున్న తాతినేని శ్రీనాథ్, పులగం రాజేష్, పులగం భీమేష్, పుప్పాల రాజేషం, పెద్ది శంకర్లను అరెస్టు చేసినట్టు తెలిపారు. మీడియా సమావేశంలో డీసీపీతో పాటు బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్, రెండో పట్టణ ఎస్సై భాస్కర్‌రావు, భీమిని ఎస్సై కొమురయ్య పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు