ETV Bharat / state

'హరితహారం మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్, కార్యదర్శిదే...' - latest news of manchiryala

మంచిర్యాల జిల్లా హాజీపూర్​ పరిధిలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించి కంపోస్ట్​ షెడ్డులను ఎమ్మెల్యే దివాకర్​రావు ప్రారంభించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత పచ్చదనంతో విరాజిల్లాలనే పల్లెప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు.

dumping yard inauguration by mla at hazipur in manchiryala
ప్రతి గ్రామ పంచాయతీలో అవి తప్పని సరి
author img

By

Published : Jul 9, 2020, 8:04 PM IST

ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డులను తప్పని సరిగా ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిధిలోని 9 గ్రామాల్లో నూతనంగా నిర్మించిన కంపోస్ట్ షెడ్డులను ఆయన ప్రారంభించారు.

ముల్కల్ల హైవేపై కల్వర్టు, సైడ్ డ్రైన్​కు శంకుస్థాపన చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి తెరాస ప్రభుత్వం ప్రతి పంచాయతికీ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి అందజేసిందన్నారు.

హరితహారంలో నాటిన చెట్ల సంరక్షణ బాధ్యతలు సర్పంచ్​, కార్యదర్శిపై ఉంటుందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఇదీ చూడండి: అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.