మంచిర్యాల జిల్లా జైపూర్లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న 55 మంది డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ రాష్ట్రస్థాయి అధ్యయన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి రోజున కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ఉపాధ్యాయులను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. సందర్శనకు అనుమతిలేదంటూ వారందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
55 మంది డీటీఎఫ్ ఉపాధ్యాయుల అరెస్ట్ - kaleswaram project
మంచిర్యాల జిల్లా జైపూర్లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న 55 మంది డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.