ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శ్రీనివాస్ అనే వ్యక్తి తాత్కాలిక డ్రైవర్‌గా విధుల్లో చేరి మంచిర్యాల డిపో ఆర్టీసీ బస్సు నడుపుతున్నాడు. గురువారం రాత్రి తాత్కాలిక మహిళా కండక్టర్, ప్రయాణికులతో కలిసి మంచిర్యాల నుంచి బస్సు చెన్నూర్ బయలుదేరింది. అక్కడ ప్రయాణికులను దించి తిరిగి వస్తుండగా బస్సు చెడిపోయింది. ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. బస్సులో డ్రైవర్, కండక్టర్ ఇద్దరే మిగిలారు. మహిళా కండక్టర్‌పై దురాలోచన చేసిన శ్రీనివాస్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. భయపడిన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఇంటికెళ్లాక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు జైపూర్‌కు వెళ్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవర్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి సెక్షన్ 354 కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!