మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పట్టణ ప్రగతి వినూత్న రీతిలో సాగుతోంది. నగరంలోని యువత పనికిరాని వస్తువులపై ఆలోచింపజేసే అందమైన బొమ్మలు గీశారు. మరికొన్ని వస్తువుల్లో మొక్కలు పెంచుతూ పచ్చదనాన్ని నింపుతున్నారు.
పనికిరాని టైర్లకు రంగులు వేసి అందులో పూల మొక్కలను నాటారు. పట్టణంలోని టేకుల బస్తీ, ఏఎంసీ ఏరియాలోని ప్రజల చేసిన ఈ ఆలోచనలు చూసి అధికారులు మెచ్చుకుంటున్నారు. కాలనీలోని పాత గోడలకు ఆలోచింపజేసేలా చిత్రాలను వేశారు.
ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ గోడలను చూసి చుట్టుపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: 'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'