హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. మంచిర్యాలలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను చాడ కలిశారు. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. సమ్మెతో సీఎం కేసీఆర్కు చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారన్నారు. 48 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించడంతోనే మనోవేదనకు గురై ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగాలకు సైతం పాల్పడుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆర్టీసీని సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్నికలలో సరైన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."