విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు పోలీసులు, ఆరుగురు గజ ఈతగాళ్లను మంచిర్యాల జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సన్మానించి వారికి రివార్డులు అందజేశారు. జిల్లాలోని కోటపెల్లి మండలం అన్నారం బ్యారేజ్ వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ఏడుగురు గొర్రెల కాపరులను, 1,400 వందల గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిన ఆరుగురు గజ ఈతగాళ్లను, సహకరించిన ఇద్దరు పోలీసులను అభినందించారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సన్మానించిన సీపీ..వారికి రివార్డులు అందించారు. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకొని ఆపదలో ఉన్నవారిని కాపాడాలని కోరారు. విధి నిర్వహణలో సమయ స్ఫూర్తిని ప్రదర్శించిన ఏఎస్ఐ నజీర్, హోంగార్డు నరేశ్‌లను డిపార్ట్మెంట్ పరంగా మెడల్ అందే విధంగా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!