రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే తగ్గి.... మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మంచిర్యాల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. అందులో 11మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్థినికి కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయింది.
దీనితో విద్యార్థులను పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాలలోని మరికొంతమంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.