మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,309 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 289 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరోవైపు చాలా మంది రోగులకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే మందులు ఇవ్వడం లేదు. మందుల పంపిణీలో ఆలస్యం జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు.
రోగులు మెడికల్ దుకాణం నుంచి మందులు తెప్పించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పాజిటివ్ రాగానే వెంటనే మందులు ఇచ్చి క్వారంటైన్‌కు పంపాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా