ETV Bharat / state

పెట్రోల్ బంక్​కు పూలదండ.. ఎందుకో తెలుసా? - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

congress protest
congress protest
author img

By

Published : Apr 1, 2022, 6:14 AM IST

02:15 April 01

పెట్రోల్ బంక్​కు పూలదండ.. ఎందుకో తెలుసా?

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్​కు ప్రదర్శనగా వెళ్లిన కాంగ్రెస్​, ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు బంక్​కు పూలదండ వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఖాళీ సిలిండర్లతో రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

మోదీ ప్రభుత్వం ఇంధనం, గ్యాస్​ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర మహిళ కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి శారద, ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇదీచూడండి: మోయలేని పెట్రో భారం.. ప్రత్యామ్నాయాలవైపు వినియోగదారుల చూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.