తెరాస, భాజపాల నుంచి పార్టీలో చేరమంటూ పిలుపువచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ అన్నారు. కాంగ్రెస్లోనే కొనసాగుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారతారననే ఊహాగానాలు వచ్చినా తనకు మద్దతు ఇస్తామంటూ ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రేమ్‌సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ నాయకుడికైనా కార్యకర్తలే బలం అని తనపై భరోసా ఉంచిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
- ఇదీ చూడండి : మంత్రి ఈటల వైద్యశాఖను మరచిపోయారు: సీఎల్పీ నేత భట్టి