ETV Bharat / state

'రెవెన్యూ ఉద్యోగుల సేవలు అభినందనీయం'

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్​ సర్వీసెస్​ అసోసియేషన్​ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. జిల్లాలోని జిన్నారం మండలం దొంగపల్లిలో గిరిజన కుటుంబాలకు కలెక్టర్​ భారతి హోలీ కేరి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

collector holi keri distributed groceries to poor
'రెవెన్యూ ఉద్యోగుల సేవలు అభినందనీయం'
author img

By

Published : May 16, 2020, 4:29 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి ప్రశంసించారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో జిన్నారం మండలం దొంగపల్లిలో 65 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు.

కరోనాను కట్టడి చేయటంలో రెవెన్యూ ఉద్యోగులు రాత్రనకా... పగలనకా... కష్టపడుతున్నారని తెలిపారు. వలస కూలీల గుర్తింపు మొదలగు కార్యక్రమాల్లో సేవా దృక్పథంతో పాల్గొంటున్నారన్నారు. రెవెన్యూ ఉద్యోగులందరూ కలిసి ట్రెసా ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.