ETV Bharat / state

పశువుల చోరీ... మళ్లీ షురూ! - Cattle theft in mancherial district

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో చెక్‌పోస్టులు, కరోనా కట్టడి చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన పశువుల దొంగల ముఠా చేతులకు పనిచెబుతోంది. కొద్ది రోజులుగా జిల్లా కేంద్రంలో పశువులు మాయమవుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై సంచరించే పశువులు, యజమానుల పర్యవేక్షణలో లేని ఆవులు, గేదెలను సులువుగా తరలిస్తున్నారు. గతంలో చోరీలకు పాల్పడిన వారే ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Cattle theft in mancherial district due to lock down
మంచిర్యాలలో పశువుల చోరీ
author img

By

Published : May 4, 2020, 10:17 AM IST

రాత్రి వేళ రోడ్లపై సేదతీరుతున్న పశువులు..

లాక్‌డౌన్‌తో మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మేకల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికంగా ఉన్న మేకల ధరలు పెరగడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు సీసీసీకి చెందిన కొంతమంది యువకులు పశువుల దొంగతనాలకు తెర లేపారు. గతంలో వీరు ఈ కేసుల్లో నిందితులే. పశువుల మాంసానికి పెద్దగా డిమాండ్‌ లేకపోవడంతో అటవీ జంతువుల మాంసం పేరుతో వీటి విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పశువు ధర మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటే దొంగలు వీటి మాంసం ద్వారా పొందుతున్నది రూ.10 వేలు మాత్రమే కావడం గమనార్హం.

ఆందోళనలో సంరక్షకులు..

జిల్లా కేంద్రంలో నెలరోజుల వ్యవధిలోనే పదికి పైగా పశువులు చోరీకి గురయ్యాయి. వరుస ఘటనలు పశువుల యజమానులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల స్థానిక గోపాల్‌వాడ ప్రాంతంలోనే పదికిపైగా పశువులు అపహరణకు గురయ్యాయి. పశువులను దొంగలు తీసుకువెళ్తున్న దృశ్యాలను కొందరు తమ చరవాణులలో నిక్షిప్తం చేశారు. ఈ వీడియో దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయం, ఇతరాత్ర అవసరాల కోసం పశువులను పెంచుకుంటున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు..

2017 సంవత్సరంలో సీసీసీలో జరిగిన చోరీలో 11 పశువులు, మంచిర్యాలలో పశువులు అపహరణకు గురైన కేసులు నమోదయ్యాయి. 2018లో కోటపల్లిలో ఒకటి, మంచిర్యాలలో పది పశువులు దొంగతనం జరిగినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు. తర్వాత పలు ప్రాంతాల్లో పశువులు చోరీలు జరిగినా ఫిర్యాదులు లేకపోవడంతో కేసులు నమోదు కాలేదు.

నిందితులపై కఠిన చర్యలు తప్పవు

జిల్లాకేంద్రంలో పశువుల అపహరణ మా దృష్టికి వచ్చింది. నిందితులను పట్టుకునే పనిలోనే నిమగ్నమయ్యాం. ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేశాం. ఎవరివైనా పశువులు కనిపించకుండా పోతే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

- ముత్తి లింగయ్య, మంచిర్యాల పట్టణ సీఐ

చోరీలను తేలిగ్గా తీసుకోవద్దు

మా ప్రాంతంలోనే ఇటీవల పదికి పైగా పశువులను ఎత్తుకెళ్లారు. వాటి ద్వారానే జీవనోపాధి పొందే కుటుంబాలు ఉన్నాయి. పశువుల చోరీలను తేలిగ్గా తీసుకోకుండా నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలి.

- సల్ల మహేష్, గోపాల్‌వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.