మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భోగి పండుగను పురస్కరించుకొని హైటెక్ కాలనీవాసులందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. తెల్లవారు జాము నుంచే భోగి మంటలు వేసి పండుగ సంబరాలను జరుపుకున్నారు. ఇళ్లలోని పాత కలప, వస్తువులను భోగి మంటలో వేసి చలి కాచుకున్నారు.
మంటల చుట్టూ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సంబరాలు చేస్తూ నృత్యాలు చేశారు. ప్రతి పండుగను తమ కాలనీవాసులందరూ ఒక్క చోటికి చేరి ఐక్యంగా జరుపుకుంటామని కాలనీవాసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?