తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో... జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తగ్గుతున్న రక్త నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా జాగృతి సభ్యులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో దాదాపు 3 వేల మంది బాధ పడుతున్నారని అన్నారు. వారికి రక్తం అందించడం కోసం రక్త నిధి కేంద్రంలో నిల్వలు తగ్గకుండా ఉంచేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రిలోని రక్త నిధి కేంద్రానికి 100 యూనిట్ల రక్తాన్ని జాగృతి తరఫున అందించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నిబంధనలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు: సీసీఎంబీ