సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో కేసీఆర్ కార్మికులను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఛత్రపతి శివాజీ సంకల్ప సభకు వెళ్తూ... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆగి సింగరేణి కార్మికుడి విగ్రహానికి పూలమాల వేశారు.
కారుణ్య నియామకాలను... కరెన్సీ నియామకాలుగా బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కార్మికులు మేల్కొని వచ్చే సింగరేణి ఎన్నికల్లో భాజపా అనుబంధ కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర'