ETV Bharat / state

‘విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలి’

మంచిర్యాల విద్యుత్​ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నేతలు ధర్నా చేశారు. లాక్​డౌన్​ సమయంలో వసూలు చేస్తున్న విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రజలు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు బిల్లులు పెంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు.

BJP Protest At Manchirial Electricity Ofiice
‘విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలి’
author img

By

Published : Jun 15, 2020, 11:00 PM IST

మంచిర్యాల జిల్లా విద్యుత్​ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. లాక్​డౌన్​ సమయంలో పెంచిన విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఒకవైపు ప్రజలు ఉపాధి లేక.. ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ఇష్టం వచ్చినట్టు విద్యుత్​ స్లాబులు మార్చి.. అధిక బిల్లులు వసూలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల రూ.200 నుంచి రూ.300 వరకు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు వస్తుందన్నారు. పెరిగిన విద్యుత్​ బిల్లులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయని భాజపా మహిళా నాయకురాలు వనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి : కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.