ETV Bharat / state

ప్రైవేట్​ ఆస్పత్రుల మోసాలను అరికట్టాలని భాజపా ధర్నా!

author img

By

Published : Sep 1, 2020, 10:37 PM IST

కరోనా వైరస్​.. కొవిడ్​ చికిత్స పేరుతో ప్రైవేట్​ ఆస్పత్రులు చేస్తున్న మోసాలను అరికట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు జిల్లా భాజపా ఆధ్వర్యంలో నిరసన  కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను అలుసుగా తీసుకొని  ప్రైవేట్​ ఆస్పత్రులు దోపిడికి దిగాయని, పేదలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

BJP Protest At Collector Office In Manchireal
ప్రైవేట్​ ఆస్పత్రుల మోసాలను అరికట్టాలని భాజపా ధర్నా!

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ కార్యాలయం ముందు భాజపా ఆధ్వర్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్​ కేసుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని భాజపా నాయకులు డిమాండ్​ చేశారు. కేసులను దృష్టిలో ఉంచుకొని అందుకు సరిపడా వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్​ ఆస్పత్రుల దోపిడి నివారించాలని జిల్లా భాజపా అధ్యక్షుడు రఘునందన్​రావు డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలో ఐసోలేషన్​ కేంద్రం లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తమ సొంత ఖర్చులతో జిల్లాలో ఐసోలేషన్​ కేంద్రం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం అందుకు అంగీకరించాలని సవాల్​ విసిరారు. ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్​ ఆస్పత్రులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రులపై ప్రభుత్వం ఆజమాయిషీ చేయకుండా.. చోద్యం చూస్తున్నదని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్​ ఆస్పత్రులు నిర్వహిస్తూ.. ఇష్టమొచ్చినట్టు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం సమర్పించారు.

ఇదీ చూడండి : ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.