మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు భాజపా ఆధ్వర్యంలో పీపీఈ కిట్లను అందజేశారు. కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కొనియాడారు.
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పనిచేసేందుకు వారికి అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మునిమంద రమేష్, అందుగుల శ్రీనివాస్, కౌన్సిలర్ అనిత యాదవ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు