తప్పిపోయిన పాపను తల్లిదండ్రులకు అప్పగించారు మంచిర్యాల పోలీసులు. జిల్లా కేంద్రంలోని క్వారీ సమీపంలో మూడేళ్ళ చిన్నారి అటు ఇటు తిరగడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పాపను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకోవడానికి విచారణ చేపట్టారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజ్ కుమార్ తన కుటుంబంతో బ్రిక్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉదయం వేళ ఆడుకుంటూ వెళ్లిన తమ చిన్నారి కనిపించలేదని తెలిపాడు. విచారణ చేసిన తర్వాత పాపను తల్లిద్రండులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు..