పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు ఓల్డ్ ఆల్వాల్ లోని వీబీఆర్ గార్డెన్ లో పెద్దఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పోలీసు సిబ్బందితో పాటు యువతలో స్ఫూర్తిని నింపి.. రక్తదానం చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్నవారికి.. ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తామని తెలిపారు. రక్తదానంతో ఇతరుల ప్రాణాలు కాపాడిన వారవుతారని వివరించారు. నారాయణగూడ రక్తనిధి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
ఇవీ చదవండి: సామాజిక మాధ్యమాలే వేదికగా తప్పుడు సమాచారం... పోలీసుల నిరంతర నిఘా