ETV Bharat / state

ఐసోలేషన్‌ కేంద్రంలో 11 మంది మృతి - మంచిర్యాలలో కరోనా మృతుల సంఖ్య

11 covid patients die
36 గంటల్లో 11 మంది కొవిడ్ రోగులు మృతి
author img

By

Published : May 6, 2021, 12:10 PM IST

Updated : May 6, 2021, 1:23 PM IST

12:07 May 06

36 గంటల్లో 11 మంది కొవిడ్ రోగులు మృతి

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రాణాలు బలితీసుకుంటోంది. తాజాాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో వరుస కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 8మంది మృతి చెందారు. 

ఇవాళ ఉదయం 8 నుంచి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవలె మత్తు వైద్యులతో పాటు ఛాతీ వైద్యుడు, టెక్నిషియన్​ను అధికారులు నియమించారు. అయినప్పటికీ రోగులు భారీ సంఖ్యలో మృతి చెందడం కలవరపెడుతోంది. కుమురంభీం, మంచిర్యాల జిల్లాలకు చెందిన రోగులే ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది చివరి నిముషంలో ఐసోలేషన్​ కేంద్రానికి వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటికే పరిస్థితి విషమించి పోతుందని.. వారి కాపాడలేకపోతున్నామని తెలిపారు. 

ఇదీ చూడండి: కొవిడ్‌ టీకా స్లాట్‌ బుకింగ్‌లో ఇక్కట్లు

Last Updated : May 6, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.