మంచిర్యాల పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఛైర్మన్ రాజయ్య జెండా ఊపి ప్రారంభించారు. స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో తెరాస యువజన విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి బాలుర పాఠశాల మైదానం వరకు రెండు కిలో మీటర్ల పరుగును నిర్వహించారు.
ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని యువజన నాయకులు ప్రసంగించారు.
ఇదీ చూడండి: యువతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే..?