మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఒకేరోజు రికార్డు స్థాయిలో ఏకంగా 129 కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సింగరేణి కార్మికులు కరోనా బారిన పడుతున్నారు.
సింగరేణి ఏరియా ఆస్పత్రి రామకృష్ణాపూర్లో బుధవారం నుంచి సింగరేణి కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. 190 మంది కార్మికులకు పరీక్షలు చేయగా 56 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, చెన్నూర్ మండలాల్లో 73 మందికి వైరస్ సోకింది.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్