సుడా, డీటీసీపీ లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతులున్న ఇళ్ల స్థలాలు, భూములు, భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు ఉత్తర్వులపై నిరసన వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సబ్రిజిస్ట్రార్తో వాగ్వాదానికి దిగారు.
ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం మరోమారు సమీక్షించాలని డిమాండ్ చేశారు.