ETV Bharat / state

'విభేదాలు పక్కన పెట్టి... పార్టీ బలోపేతానికి కృషి చేయండి' - kc venugupal

విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ స్పష్టం చేసింది. పార్టీని వీడే నాయకుల గురించి పట్టించుకోవద్దని క్షేత్రస్థాయిలో శ్రేణుల్లో నైరాశ్యం నెలకొనకుండా చూసుకోవాలని సూచించింది.

పార్టీ బలోపేతానికి కృషి చేయండి
author img

By

Published : Aug 24, 2019, 5:50 AM IST

Updated : Aug 24, 2019, 7:27 AM IST

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం పనితీరుపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్​సభ ఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ.. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలపలేకపోయారని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మర్రి శశిధర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశాలకే పరిమితం కావొద్దు..

రాష్ట్రంలో పార్టీ పనితీరుపై ఆరా తీసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ బలోపేతానికి నాయకులు అంత కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు. కొందరు నాయకులు మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేసేటప్పుడు పూర్తిస్థాయిలో సమాచారం నిర్దిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించకుండా పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా అమలయ్యేలా చూడాలన్నట్లు తెలుస్తోంది.

పార్టీ వీడే వారి గురించి ఆందోళన వద్దు...

పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో కొంతమంది నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారని వేణుగోపాల్ దృష్టికి కొందరు నాయకులు తీసుకెళ్లగా.. ఆయన తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడే నాయకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే దానిపైన రాష్ట్ర నాయకత్వం పోరాటం చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్... ప్రాజెక్టుల బాట పట్టాలని నిర్ణయించింది.

ఈరోజు ఉదయం 10 గంటలకు కేసీ వేణుగోపాల్​తో కాంగ్రెస్ నాయకులు మళ్లీ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: విద్యుత్​పై సీబీఐ విచారణకు సిద్ధం: ట్రాన్స్​కో సీఎండీ

Tg_hyd_08_24_cong_panchayathi_Delhi_pkg_3038066 Reporter: M. Tirupal reddy ()విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఏఐసిసి స్పష్టం చేసింది. పార్టీ వీడే నాయకుల గురించి పట్టించుకోవద్దని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొనకుండా చూసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు పార్టీ చేరువ కావాలని దిశా నిర్దేశం చేసింది. Look Vo1: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పని తీరుపై ఏఐసిసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన, లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ...పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలపలేక పోయిందన్న అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ 75 వ జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్లారు. నిన్న శుక్రవారంనాడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ తో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాజీ ఎంపీ మర్రి శశిధర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని తీరుపై ఆరా తీసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ పార్టీ బలోపేతానికి నాయకులు అంత కలిసికట్టుగా పనిచేయాలని స్పస్టం చేశారు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లో నాయకులు విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు నాయకులు మీడియా సమావేశాలకె పరిమితం అవుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేసేటప్పుడు పూర్తిస్థాయిలో సమాచారం నిర్దిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించకుండా పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా అమలయ్యేలా చూడాలన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో కొంతమంది నాయకులు పార్టీని విడి వెళ్తున్నారని వేణుగోపాల్ దృష్టికి కొందరు నాయకులు తీసుకెళ్లగా తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడే నాయకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పెషల్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే దానిపైన రాష్ట్ర నాయకత్వం పోరాటం చేయాలని సూచించింది. అధికార పార్టీ మూలంగా దాడి జరిగితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏకతాటిపై నిలచి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పార్టీ కార్యకలాపాలల్లో భాగస్వామ్యం చేసి కలుపుకుని పోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రాజెక్టుల బాట పట్టాలని నిర్ణయించింది. ఇదే అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ …. పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ఇవాళ ఉదయం 10 గంటలకు తిరిగి కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశం కానున్నారు రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అయన దృష్టికి తీసుకెళ్లేందుకు, పార్టీ సీనియర్ నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దిశ లో వెళ్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరును వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లి పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది.
Last Updated : Aug 24, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.