మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు సరిహద్దుగా ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది. భారీ వర్షాల వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ, నారాయణపేట జిల్లా లోని మద్దూరు, వికారాబాద్‌లోని దౌల్తాబాద్ మండలాల నుంచి కోయిల్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది.
జలాశయంలో నీటి మట్టం పెరుగుతున్నందున వచ్చిన నీటిని వచ్చినట్లు 11 గేట్లు ఎత్తివేసి అధికారులు దిగువకు వదులుతున్నారు. గత పదేళ్ల కాలంలో అత్యధిక సార్లు నీటిని వదలడం ఇదే తొలిసారి అధికారులు చెబుతున్నారు. సాగర్ నీరు చేరడం వల్ల బండర్ పల్లి వాగు పరవళ్లు తొక్కుతుంది. వాగు అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులతో జలాశయం వద్ద సందడి నెలకొంది.
ఇదీ చూడండి: ఏడుపాయల దుర్గాభవాని కోవెల వద్ద వరద ఉద్ధృతి