పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులంతా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఓటర్ల జాబితాలో అర్హులైన విద్యావంతులు 100% నమోదు చేసుకునే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆల సూచించారు.
ఇదీ చదవండిః శనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు