ETV Bharat / state

భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ

భర్త చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ... రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఓటేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఉమ.

భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ
author img

By

Published : May 10, 2019, 10:35 AM IST

Updated : May 10, 2019, 12:48 PM IST

భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 6 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఓ మహిళ భర్త చనిపోయినప్పటికీ... మృతదేహం ఇంట్లోనే ఉన్నా.. ఓటేసేందుకు వచ్చింది. ఓటు ప్రాధాన్యతను తోటి ఓటర్లకు తెలిపి ఆదర్శంగా నిలిచింది.

దేవరకద్రకు చెందిన శ్రీనివాసులు కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్​లో నివసిస్తున్నారు. ఎన్నికలు ఉన్నందున గురువారం స్వగ్రామానికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. విషయం గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లేలోపే శ్రీనివాసులు మృతి చెందాడు. శోకసముద్రంలోనూ ఆ కుటుంబ సభ్యులు పోలింగ్​లో పాల్గొనడాన్ని గ్రామస్థులంతా అభినందించారు.

ఇవీ చదవండి: ఓటేయడానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించిన విఘ్నేష్

Intro:Tg_Mbnr_11_10_Vote_chethyanam_Avb_G3
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 6 మండలాలలో జడ్పిటిసి ఎంపిటిసి ప్రదేశ్ ఎన్నికలు 200 కొనసాగుతున్నాయి ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఓ మహిళ చనిపోయిన భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని తీవ్ర శోకో సముద్రంలో మునిగి ఉన్న ఆ కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తోటి ఓటర్లకు తెలిపిన సంఘటన పేరూరు గ్రామంలో లో చోటు చేసుకుంది

Body:మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గంలోని దేవరకద్ర మూసాపేట అడ్డాకుల చిన్న చింత కుంట మదనాపురం కొత్తకోట మండలాలలో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల రెండో దశలో కొనసాగుతున్నాయి ప్రారంభం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలుదేరారు దేవరకద్ర మండలం లోని పేరూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబం హైదరాబాద్ లో ఉపాధి పనులు చేస్తూ జీవనం గడిపేవారు. శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఇ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన శ్రీనివాసులు(39) కింద పడి తీవ్ర అస్వస్థతకు గురైనాడు విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ కు వైద్యం కోసం తరలించారు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తీవ్ర శోకసముద్రంలో లో మునిగిన కుటుంబం స్వగ్రామానికి చేరుకున్నారు శోకసముద్రంలో నా కుటుంబం గ్రామంలో జరుగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో లో తో ఓటర్ల తో కలిసి పంటిబిగువన తమ దుఃఖాన్ని ఆపుకొని ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటు చైతన్యాన్ని గ్రామస్తులు అభినందించారు అండగా నిలిచారు. మృతి చెందిన శ్రీనివాసులు కు ఇద్దరు ఆడపిల్లలు కావడం రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో శ్రీనివాసులు మృతితో విషాద ఛాయలు నెలకొన్నాయి చిన్నారుల రోధనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి.
బైట్: 1.మృతుడి బంధువులు
2. మృతి చెందిన శ్రీనివాసుని భార్య ఉమ

Conclusion:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లో ఓటు చైతన్యం కొనసాగుతుంది ఓటర్లందరూ వివిధ గ్రామాల నుంచి చేరుకుని తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించుకుంటున్నారు.
Last Updated : May 10, 2019, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.