మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో జిల్లా, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహించేందుకు ఎంపీడీఓ కుసుమ మాధురి ఏర్పాట్లు చేశారు. అదే స్థాయిలో అర్జీదారులు స్పందిస్తూ గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులకు అధికారులకు తమ సమస్యలను వినిపించేందుకు వినతిపత్రంతో బారులు తీరారు.
అల్లిపూర్‌లో జరుగుతున్న ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ స్వయంగా పరిశీలించి అర్జీదారుల దరఖాస్తులను స్వీకరించి అక్కడే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రజావాణి అనంతరం పక్కనే ఉన్న పాఠశాల, మధ్యాహ్న భోజనం పరిస్థితి, గ్రామంలో నిర్మిస్తున్న స్టేడియాన్ని పరిశీలించారు. జిల్లాలో తొలిసారిగా గ్రామ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టిన ఎంపీడీఓ కుసుమ మాధురిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇవీ చూడండి: 'నూతన సచివాలయం... 27న శంకుస్థాపన'