ETV Bharat / state

'పరిహారం తిరిగి ఇచ్చేస్తాం- మా భూములు మాకిప్పించండయ్యా'

Udandapur Reservoir Lands Issue in Mahbubnagar : జలాశయం కింద ముంపునకు గురవుతాయని భూముల్ని సేకరించారు. పరిహారం కూడా చెల్లించారు. తీరా జలాశయం పూర్తయ్యాక భూములు ముంపులో పోకుండా మిగిలిపోయాయి. కొంత భూమైనా మిగిలిందని నిర్వాసిత రైతులు సంతోషించారు. కానీ ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం ఇచ్చేస్తాం భూములు తమకే ఇవ్వాలంటూ రైతులు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. మహబూబ్ నగర్ జిల్లా ఉదండపూర్ జలాశయం కింద జరుగుతున్న భూ అక్రమాలపై ప్రత్యేక కథనం.

Farmers Lands issue in Udandapur
Udandapur Reservoir Lands Issue in Mahbubnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 2:30 PM IST

పరిహారం తిరిగి ఇచ్చేస్తాం- మా భూములు మాకిప్పించండయ్యా

Udandapur Reservoir Lands Issue in Mahbubnagar : మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Ranga Reddy Project) కింద నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయం కింద ఉదండపూర్, వల్లూరు సహా 7తండాలకు చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయారు. ముంపు పేరుతో భూముల్ని అధికారులు సేకరించినా, జలాశయం నిర్మాణం తర్వాత అవి ముంపులో లేకుండా మిగిలి పోయాయి. దీంతో భూములు కోల్పోని రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పరిహారాన్ని ఇచ్చేస్తామని భూములు తిరిగి తమ పేరిట ఇవ్వాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, ప్రజావాణిలో కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా భూములు వారికి దక్కలేదు. తాజాగా ఆ భూములు తమవని, అందులోకి రావద్దని కొందరు రంగప్రవేశం చేసి గొడవలకు దారితీసింది.

'కొంత భూమి రోడ్డుకు పోయింది.. ఉన్నకొంచెం ఆన్​లైన్​ కాలేదు'

Udandapur Reservoir Lands Possession : 145 సర్వే నెంబర్​లో భీమ్లాకు చెందిన రెండెకరాలు, పుల్యానాయక్ సోదరులకు చెందిన నాలుగున్నర ఎకరాలు జలాశయం కట్టకు ఆవల మిగిలి పోయాయి. వారు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. కాని అది వారి భూమే కాదని, ముంపులో పోయిందని కొందరు తమ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకే సర్వే నెంబర్ పేరుతో విలువైన భూముల్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని భాధితులు ఆరోపిస్తున్నారు. 94వ సర్వే నంబరులో సాయిలుకు 3.39 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తండ్రి చెన్నయ్య పేరు మీద ఉంది. జలాశయంలో ముంపునకు గురవుతుందని అవార్డు పాసు చేసి రూ.25 లక్షల చెక్కు సిద్ధం చేశారు. కాని ఆ చెక్కు తీసుకునేందుకు రైతు నిరాకరించారు. తీరా చూస్తే వారి భూములు ముంపునకు బైటే ఉన్నాయి.

భూమి ఉన్నా... హక్కుల్ని అనుభవించలేక అవస్థలు పడుతున్న రైతులు

200 Acres Possession in Mahabubnagar Issue : ముంపులో పోని భూముల స్వాహాకు ఓ స్థిరాస్తి వ్యాపారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుటుంబ నేపథ్యం, ముఖ్యనేతల అండదండలతో, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో 200 ఎకరాలకుపైగా భూముల స్వాధీనానికి పకడ్బందీగా పావులు కదిపినట్లు సమాచారం.

రైతులను సాగు చేసుకోనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు, పరిహారం తీసుకోని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు(Farmers Land Issue in Udandapur). ఈ వ్యవహారం బైటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్ నీటిపారుదల, రెవెన్యూ సహా సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమగ్ర విచారణ జరిగితే వందల ఎకరాల అక్రమ వ్యవహారాలు మరిన్ని బైటపడే అవకాశం కనిపిస్తోందని స్థానికులు భావిస్తున్నారు.

Farmers Protest at Thoguta MRO Office : మా చెక్కులిచ్చే వరకు కదిలేదు లేదు.. ఎమ్మార్వో ఆఫీస్​లో బైఠాయించిన రైతులు, ఎమ్మెల్యే

'మా భూమి మాకిప్పించండయ్యా.. దండం పెడతాం..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.