మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో బాధితులు 42కు చేరారు. జడ్చర్లకు చెందిన వ్యక్తి ప్రైవేటు ఉద్యోగిగా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తింస్తుండగా.. అనుమానంతో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధరణ కాగా జడ్చర్లలో అతని కుటుంబ సభ్యులను హోమ్ క్వారైంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. నవాబుపేట మండలంలో ఓ వ్యక్తి 15 రోజుల క్రితం రాయచూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని 42 కేసుల్లో 12 మంది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మిగతా 18 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మంది ఎదిర మెడికల్ కళాశాలలో, 11 మంది ఎస్వీఎస్ ఐసొలేషన్ వార్డులో ఉన్నారు. మిగిలిన 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాకు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి 18 వేల 787 మంది రాగా.. 1021 మందిని హోం క్వారంటైన్ చేశారు. ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు ఇప్పటివరకు 105కు చేరాయి.
ఇదీ చూడండి : 'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం.. 50 వేల మందికి పరీక్షలు'