మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మూసాపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు మోటర్ సైకిల్‌పై జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేసిన పోలీసులు... మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఇవీ చూడండి: గొడ్డళ్లు, రాళ్లతో ఇంటిపై దాడి... పలువురికి గాయాలు