ETV Bharat / state

Tummilla Lift Irrigation Project in Gadwal : తుమ్మెద తుమ్మిళ్లలో నీళ్లు లెవ్వు తుమ్మెద.. పంటలన్ని ఎండిపోయే తుమ్మెద - పాడీ పంట నష్టాలు

Tummilla Lift Irrigation Project in Gadwal : గతేడాదిలాగే ఈ ఏడాదీ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద సాగునీరు అందుతుందని ఆశించారు ఆయకట్టు రైతులు. నీరు వస్తుందన్న ఆశతో గతేడాది ఎకరం సాగు చేసినవారు ఈసారి రెండెకరాలు సాగుచేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఆయకట్టుకు కేవలం 5రోజులు నీళ్లు విడుదల చేసిన అధికారులు . నీటి లభ్యత లేక ఆపేశారు. సాగునీరు, వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పత్తి రైతులు చేలను పెరికివేసి ముందస్తు యాసంగికి సన్నద్ధమవుతుండగా.. కంది, మొక్కజొన్న, మిరప రైతులు వరణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Tummilla Lift Irrigation Project
Tummilla Lift Irrigation Project in Jogulamba Gadwal
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2023, 9:51 AM IST

Tummilla Lift Irrigation Project in Jogulamba Gadwal నీళ్లు లేక తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద ఎండిపోతున్న పంటలు

Tummilla Lift Irrigation Project in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై ఆధారపడి సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. అక్కడ సాధారణంగా వర్షాధార పంటలే సాగుచేస్తారు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు రైతులకు వానాకాలంలో సాగునీరందగా ఈసారి వస్తాయని ఆశించి పెద్దఎత్తున పంటలు(Paddy Crops) వేశారు. కానీ వర్షాభావ పరిస్థితులు, ప్రస్తుతం తుంగభద్రలో నీరులేకపోవడంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి సాగునీరు అందిచంలేని దుస్థితి. నీళ్లు లేక, వానలూ రాక వేసిన పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

No Water in Thummilla Lift Irrigation Project : వానాకాలం ప్రారంభంలో వానల్లేక రెండు, మూడుసార్లు పత్తి విత్తాల్సి వచ్చింది. జులైలో కురిసిన వానలు పంటకు ఊరటనిచ్చినా మొక్క ఎదుగుదల లేకుండాపోయింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితితో పత్తి ఎర్రబారిపోతోంది. ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేక ఇప్పటికే చాలా మంది రైతులు పత్తి పంటను పెరికి వేసి.. ముందస్తు యాసంగికి సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న, కంది రైతుల పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. కంది మొక్కలు పసుపురంగులోకి మారిపూతరావట్లేదు. మొక్కజొన్నలో మొక్క ఎదుగుదల లేక కంకి నాణ్యంగా రావట్లేదు. మిరప రైతు పరిస్థితీ దారుణంగా తయారైంది. కనీసం పెట్టుబడి దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

ఈ వానాకాలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటివిడుదల మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం 5 రోజులే నీటిని విడుదల చేసి నదిలో నీటిలభ్యత లేక.. ఆ తర్వాత ఆపేశారు. 21 డిస్టిబ్యూటరీ నుంచి 28వ డిస్టిబ్యూటరీ వరకు కొద్దిమేర నీటితడులు అందాయి. 29వ డిస్టిబ్యూటరీ నుంచి.. దిగువకు నీరందలేదు. జూరాల లింక్ కెనాల్ కింద ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మిగిలిన ఆయకట్టు ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి ఉంది. నీరులేక దాదాపు పంటపై రైతులు ఆశలు వదులుకునే దుస్థితి నెలకొంది.

Cotton Farmers Problems Telangana 2023 : ప్రతికూల వాతావరణం.. పత్తి రైతులకు శాపం

Crops Damage in Alampur : రూ.783కోట్లతో 57,500 ఎకరాలకు సాగునీరందే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. తుంగభద్ర నదిలో వరద ఉన్నప్పుడు ఆ నీటిని.. ఆర్​డీఎస్​ కాల్వలకు ఎత్తిపోసేలా పనుల్ని పూర్తిచేశారు. మూడేళ్లుగా వానాకాలంలో వరద ఉన్నప్పుడు ఆయకట్టుకు విడతల వారీగా విడుదల చేస్తున్నారు. కానీ ఈసారి నదిలో నీటిలభ్యత లేక సమస్యలు తప్పడం లేదు.

సమస్య పరిష్కారానికి తుమ్మిళ్ల రెండో దశకింద మూడు జలాశయాల నిర్మాణం జరగాల్సి ఉన్నా.. ఒక్క జలాశయాన్ని ప్రభుత్వం నిర్మించలేదు. ఆ పనులు పూర్తిచేసి ఉంటే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జలాశయాల నిర్మాణంపై దృష్టి సారించాలని తుమ్మిళ్ల ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Crops Damaged: పంట చేతికి రాకపోయే.. పరిహారంపై స్పష్టత లేకపాయే..

Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.