ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిది డిపోల పరిధిలో 3వేల 915 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. నేటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. మరోవైపు దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. పోలీసు బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులు వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పరిస్థితిపై మరిన్ని విషయాలు ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు.
నేటి నుంచి ఆర్టీసీ సమ్మె మరింత ఉద్ధృతం
ఆర్టీసీ సమ్మె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం సమస్యను పరిష్కరించని కారణంగా ఉద్యోగులు సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు వెల్లడించారు.