మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయిందని వాపోయారు. ఆయినా కూడా ఇప్పటి వరకు పోస్టింగ్ కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: కార్యకర్తల ముందు గండ్ర కంటతడి..!