పాలమూరు జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో తెరాస హవా కొనసాగింది. జిల్లాలో మొత్తం 13 జడ్పీటీసీ స్థానాలకు గానూ తెరాస క్లీన్‌స్వీప్ చేసి పాలమూరుపై తన పట్టును నిలుపుకుంది. జిల్లాలోని 169 ఎంపీటీసీ స్థానాలకు 113 స్థానాల్లో కారు జోరు చూపింది. 38 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. భాజపా 6 స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. ఇతరులు 12 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇతర పార్టీలు కనీసం ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని గెలవలేకపోయాయి. తాజా ఫలితాలతో జిల్లాలో తెరాస నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
# | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | వామపక్షాలు | మొత్తం |
జడ్పీటీసీ | 13 | 0 | 0 | 0 | 0 | 13 |
ఎంపీటీసీ | 113 | 38 | 6 | 0 | 0 | 169 |
మండలాల వారీగా ఫలితాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
అడ్డాకల్ | 8 | 1 | 0 | 0 | 9 |
బాలానగర్ | 10 | 1 | 0 | 1 | 12 |
భూత్పూర్ | 6 | 2 | 1 | 1 | 10 |
చిన్నచింత కుంట | 6 | 5 | 2 | 0 | 13 |
దేవరకద్ర | 12 | 3 | 1 | 0 | 16 |
గండీడ్ | 11 | 9 | 0 | 0 | 20 |
హన్వాడ | 11 | 0 | 1 | 2 | 14 |
కోయిలకొండ | 11 | 5 | 0 | 2 | 18 |
మహబూబ్‌నగర్ | 9 | 1 | 1 | 2 | 13 |
మిడ్జిల్ | 5 | 3 | 0 | 1 | 9 |
మూసాపేట్ | 5 | 2 | 0 | 1 | 8 |
నవాబ్‌పేట్ | 13 | 5 | 0 | 1 | 19 |
రాజాపూర్ | 6 | 1 | 0 | 1 | 8 |
ఇవీ చూడండి : వనపర్తి జిల్లాలో అభ్యర్థుల గెలుపు సంబురాలు