Case on Minister Srinivas Goud in HRC: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మహబూబ్‌నగర్‌లోని 43వ వార్డు తెరాస కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి.. మంత్రిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ నుంతి తనకు ప్రాణహాని ఉందని.. ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్‌కు సుధాకర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తనపై కక్ష కట్టారని సుధాకర్ ఆరోపించాడు. తనను చంపేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. శ్రీనివాస్‌గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరాడు.
ఇదీ చదవండి: Telangana High Court on Corona: కొవిడ్ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్, డీజీపీ