ETV Bharat / state

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...? - Railway gate

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఉన్న రైల్వే లెవల్‌ క్రాసింగ్​ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ లెవల్‌ క్రాసింగుల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులతో వాహనదారులు, జనం నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలతో అనుసంధానం చేసే 167వ జాతీయ రహదారి దేవరకద్రలోని రైల్వే గేట్​తో తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొవటం నిత్యకృత్యంగా మారింది.

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...?
author img

By

Published : Jul 22, 2019, 5:33 PM IST

నిజాం కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కేంద్రానికి రహదారిని నిర్మించి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టం చేశారు. అనంతరం జరిగిన రైల్వే మార్గాల విస్తరణతో ఏర్పాటుచేసిన రైల్వే గేట్​పై ఆర్వోబీ నిర్మాణం జరగక స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...?

నిత్యం రద్దీగా...

నిత్యం దేవరకద్ర మీదుగా కాచిగూడ- కర్నూల్​ మధ్య సుమారు 45 రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఉదయం సమయంలోనే కనీసం 25 రైళ్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో కనీసం 10 నుంచి 40 నిమిషాలపాటు గేట్​ వేస్తుంటారు. ఈ రహదారిపై నిత్యం హైదరాబాద్ నుంచి కర్ణాటక లోని ప్రధాన పట్టణాలకు, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్ నుంచి నారాయణపేట , వనపర్తి , మహబూబ్ నగర్ జిల్లా వాసులు దేవరకద్ర మీదుగా వెళ్తుంటారు.

ఐదేళ్లుగా నిర్మాణాలు.. నిత్యం నరక యాతనలు

పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆర్​ఓబీ నిర్మాణానికి 2014లో శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వివిధ కారణాలతో చేపట్టిన పనులు ఆదిలోనే ఆగిపోయాయి. 2019లో తిరిగి ఆర్వోబీ నిర్మాణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు రూ.24 కోట్ల బడ్జెట్​తో ఇరువైపులా కిలోమీటర్ మేర రోడ్డు నిర్మాణం చేపట్టింది. అయితే పనులు ఆలస్యంగా సాగడం స్థానికులకు సమస్యగా మారాయి. వీలైనంత త్వరగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయాలని అప్పటి వరకు ప్రత్యేక సిబ్బందితో ట్రాఫిక్​క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీచూడండి: అంబారీపై... అమ్మవారు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.