మహబూబ్ నగర్ పట్టణంలోని రాజీవ్ కూడలిలో ఎంబీసీ కాంప్లెక్స్ లోని పై అంతస్తులో మణప్పురం గోల్డ్ లోన్ సంస్థ కార్యాలయం ఉంది. శని,ఆదివారాలు సెలవు. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపేందుకు మంచి సమయం అనుకున్నారు. పక్కనే ఏపీజీవీబి బ్యాంక్ తో పాటు.. ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేసే దుకాణాలు కూడా ఉన్నాయి. పథకం ప్రకారం ముందుగా బ్యాంక్ తాళాలు పగుల కొట్టే ప్రయత్నం చేశారు. అది వారికి సాధ్యం కాలేదు. దీంతో మెట్ల మార్గం పక్కనే ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేసే దుకాణంలోకి రంధ్రం చేసి చొరబడ్డారు. అందులో నుంచి మణప్పురం గోల్డ్ సంస్థలోకి పోయేందుకు యత్నించారు. ఈ ప్రయత్నమూ ఫలించక వచ్చినదారినే వెనుదిరిగారు దుండగులు.
సోమవారం ఉదయం మణప్పురం గోల్డ్ సంస్థ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తమ సంస్థలలో ఏమీ చోరీకి గురి కాలేదని సంబంధిత సంస్థల అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్... 7 లక్షల బంగారం స్వాధీనం