మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు స్వచ్ఛమైన గాలి, రక్షిత మంచినీరు, సరైన ఆహారం అవసరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూశాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన "పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఆరోగ్యంగా మన మహబూబ్ నగర్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని గ్రామీణ స్వచ్ఛమైన గాలి ఉందన్న మంత్రి పట్టణానికి సమీపంలో 2,097 ఎకరాలలో కేసీఆర్ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆహార పదార్థాల కల్తీని నిర్మూలించాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటి అందిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మినరల్ నీటి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రజలంతా మిషన్ భగీరథ నీటిని వినియోగించాలని సూచించారు. ఆహార పదార్థాల కల్తీని నిర్మూలించాలన్న మంత్రి కల్తీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలను చైతన్యం చేస్తాం
"పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఆరోగ్యంగా మన మహబూబ్ నగర్" కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కరపత్రాలు, గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ - ఆఫీస్ ద్వారా ఎక్కువ ఫైళ్లు నిర్వహించిన జిల్లా అధికారులకు వేయి రూపాయల ప్రోత్సాహకం తో పాటు ధ్రువపత్రాలను మంత్రి అందజేశారు.
ఇదీ చదవండి : ఉమ్మడి పాలమూరులో వివక్ష తగ్గింది.. చిట్టితల్లి నవ్వింది..