భాజపా ఒత్తిడి మేరకే అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని... తీరా ఈ భేటీలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కమలం నేతలు మండిపడ్డారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కూడలిలో నిరసన చేపట్టారు. కృష్ణానదిలో రావాల్సిన నీటి వాటాపై పోరాడాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.
అనంతరం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఆ తరువాత రైతుబజార్లో నెలకొన్న సమస్యలపై పురపాలక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులు తాము పండించుకున్న పంటలను అమ్ముకోకుండా అధికారులు ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి: మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులు రద్దు చేయాలి: వివేక్