మహబూబ్నగర్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ వార్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ముందుగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆరోగ్య కిట్లను ఆయన అందజేశారు. లాక్డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ గొప్పదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ విధుల్లో ఉన్నప్పుడు మాస్క్లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబ్నగర్ పట్టణంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని కోరారు. 100 శాతం లక్డౌన్ పాటించాలన్నారు. విచ్చలవిడిగా బయట తిరిగితే ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి : మాయదారి మనిషిని నేను అంటున్న ఎస్పీ బాలు