రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ బిల్లును ప్రవేశపెడితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తుండడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీ నారాయణ ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పోకడలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని.. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేస్తోందని ఆయన విమర్శించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డుపెడుతోందంటూ దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని.. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని ఆయన వివరించారు.
ఇదీచూడండి.. ఆ బిల్లుల ఆమోదంపై రైతన్న ఆగ్రహం