ఉపసర్పంచ్‌తోపాటు సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన సర్పంచ్ సంఘం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్‌లోని జడ్చర్లలో ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహిస్తున్న సర్పంచ్ల సంఘం ప్రతినిధులను పోలీసులు నిర్బంధించారు. అటుగా వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. డీఎస్పీ భాస్కర్ జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు.
ఇదీ చూడండి: డ్రైవర్ లేకుండానే నడిచే కారు కొన్న సచిన్