ETV Bharat / state

అలంరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అంతరించిపోతున్న కళల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు
author img

By

Published : Jun 3, 2019, 9:52 AM IST

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రోనాల్డ్ రోస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, భద్రాచలం తదితర ప్రాంతాల కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భద్రాచలం జిల్లా గుత్తికోయల డోలు వాయిద్యం, గోండు కళాకారుల కింక్రీ వాద్యాలు అలరించాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న కళాకారులందరికీ జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందించి అభినందించారు.

Intro:TG_Mbnr_18_02_Samskruthika_Sambaralu_AB_C4

( ) అంతరించిపోతున్న కళల పరిరక్షణకు ప్రతి ఒక్కరం పాటు పడతామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా ప్రకృతి సహజ సిద్ధమైన వసు వస్తువులతో తయారు చేసిన వాద్యపరికరాల కళారీతులను ప్రదర్శించారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఆదిలాబాద్ వరంగల్, కరీంనగర్, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ నుంచి వచ్చిన కళాకారులు నిర్వహించిన బుద్ధుడి ముగ్గులు అందరిని ఆకట్టుకుంది.
భద్రాచలం జిల్లా గుత్తికోయల డోలు వాయిద్యం అందరినీ అలరించడంతో పాటు గోండు కళాకారుల కింక్రీ వాద్యం, చామలాలి బృందం కళాకారుడు లింగు... 12 మెట్ల ఆదివాసి కిన్నెర వాద్యం చక్కగా ప్రదర్శించారు

Conclusion:గాయకుడు డా. సుబ్రహ్మణ్యం ఆలపించిన అన్నమయ్య సంకీర్తన విశేషంగా నిలిచింది. చిన్నారులు వివిధ ఆధ్యాత్మిక, జానపద గీతాలకు నృత్యం చేశారు. ఈ సాంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న కళాకారులందరికీ జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందించి అభినందించారు.......spot.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.