ETV Bharat / state

నిరుద్యోగులపై ఆర్టీసీ కార్మికుల దాడి

మహబూబ్​ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో గందరగోళం నెలకొంది. రేపటి నుంచి కార్మికుల సమ్మె చేస్తుండగా... కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారిపై ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు.

author img

By

Published : Oct 4, 2019, 5:54 PM IST

నిరుద్యోగులపై ఆర్టీసీ కార్మికుల దాడి

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రత్నమ్యాయ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే తాత్కలిక పద్ధతిలో డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు మహబూబ్​నగర్​కి చెందిన కొంత మంది యువకులు డిపోకి చేరుకున్నారు. అదే సమయంలో నిరసనలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్న కొందరు కార్మికులు వారిపై ఒక్కసారిగా దాడికి దిగినట్టు బాధితులు వాపోయారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము వ్యతిరేకం కాదని బాధితులు తెలిపారు. నిరుద్యోగ పరిస్థితులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసేందుకు వచ్చామని తెలిపారు. కానీ ఆర్టీసీ ఆర్టీసీ ఉద్యోగులు తమపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

నిరుద్యోగులపై ఆర్టీసీ కార్మికుల దాడి

ఇవీ చూడండి: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.