ETV Bharat / state

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది

రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జీతం లేక ఇళ్లు గడవడం కష్టమైంది. ఈనెల ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా... వేతనాలు ఇవ్వకపోవడంతో... మహబూబ్​నగర్​లో ఆర్టీసీ సిబ్బంది అంతా ఆందోళన బాట పట్టారు. ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఒప్పందం ఉన్నప్పటికీ... యాజమాన్యం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
author img

By

Published : Aug 14, 2019, 5:43 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో తొమ్మిది డిపోల పరిధిలో నాలుగు వేల 290మంది ఉద్యోగ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 8కోట్ల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యాజమాన్యం రెండు మాసాలుగా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. దీనితో ఇళ్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:
తమకు ప్రతినెల సకాలంలో అందాల్సిన వేతనాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి దినం రాలేదని... ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
ఆందోళన ఉద్ధృతమే: ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని... లేనిపక్షంలో బస్సులను నిలిపివేసి సమ్మేబాట పడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు నెలసరి వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు.ఇదీ చూడండి: జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్​లో పాక్షికంగా అమలు

Intro:TG_Mbnr_10_07_No_Salaries_For_RTC_Employes_PKG_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు జీతభత్యాల కోసం ఆందోళన బాట పట్టారు. గత రెండు మాసాలుగా నెలసరి వేతనాలు సకాలంలో అందుకోలేకపోతున్నారు. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు అందక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Body:రెండు నెలలుగా వేతనాలు సరిగా అందక పోవడంతో ఆర్టీసీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఒకటో తారీకునే జీవితాలు అందుకున్న తమకు.. ఈ నెల ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా వేతనాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పిల్లల చదువులు, బ్యాంకు రుణాలు, ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఒప్పందం ఉన్నా... యాజమాన్యం ఈ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.

vo. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొమ్మిది డిపోల పరిధిలో నాలుగు వేల 290 మంది ఉద్యోగ కార్మికులు పనిచేస్తున్నారు వీరికి నెల 8 కోట్ల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది అయితే యాజమాన్యం రెండు మాసాలుగా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు దీంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం తక్షణమే స్పందించి వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. సంస్థ లాభనష్టాలతో కార్మికులకు సంబంధం లేకపోయినా... ప్రతి డిపో 70 నుంచి 80 శాతం ఓవర్ సాధిస్తుందని వివరించారు.

Conclusion:తమకు ప్రతినెల సకాలంలో అందాల్సిన వేతనాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ధినం రాలేదని... ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమేనని... ఆర్టీసీకి రావాల్సిన 12 వందల కోట్లు చెల్లించలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో బస్సులను నిలిపివేసి సమ్మెబాట పడతామన్నారు.....bytes
బైట్స్
బసప్ప, టీఎంయూ, జిల్లా అధ్యక్షుడు
శ్రీనివాస్, టీఎంయూ, ప్రధాన కార్యదర్శి
రవీందర్, డ్రైవర్

Evo.ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు నెలసరి వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.