ETV Bharat / state

KODANDARAM: 'నదీ జలాల సాధన కోసం సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలి'

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నది జలాల్లో దక్కాల్సిన వాటా సాధించుకోలేకపోయామని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రాలకు సంబంధించిన నదీజలాలు, ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చెలాయించడం ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా సాధన కోసం సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.

KODANDARAM
KODANDARAM
author img

By

Published : Jul 26, 2021, 10:36 AM IST

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా సాధన కోసం సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్​ కోదండరాం (kodandaram) పిలుపునిచ్చారు. ‘కృష్ణానది నిర్వహణ బోర్డు ఏర్పాటు-పరిణామాలు అనే అంశంపై ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం రెడ్‌క్రాస్‌ సమావేశ మందిరంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి (round table meeting) ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదండరాం విమర్శించారు. కృష్ణానది నుంచి రాష్ట్రానికి 812 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. కేవలం 299 టీఎంసీలు మాత్రమే వస్తోందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు దక్కుతాయని పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటే.. గత ఏడేళ్ల నుంచి కృష్ణా జలాల వాటాను సాధించుకోలేక పోతోందని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణా బోర్డులో మితిమీరి జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి భాగాలను పరిష్కరించి.. తగిన న్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా దక్కించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 821 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. మనకు 299 టీఎంసీలే వస్తుంది. వాస్తవానికి వాటా పెంచుకోవాలి. ఈ ఏడేళ్లలో ప్రభుత్వం వాటా పెంచుకోలేదు. మనవైపు వాటాను వినియోగించుకోవడానికి ఉన్న నిర్మాణాలు, ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచే ప్రయత్నమూ చేయలేదు. మరి ఇప్పుడు గెటిట్​ తెచ్చినంక ప్రభుత్వం చేతిలో అధికారం పోయింది. అది పూర్తిగా కేంద్రప్రభుత్వం చేతిలో పడిపోయింది. వాస్తవానికి కేంద్రప్రభుత్వం కూడా ఇంత విస్తృత అధికారాలు చేజిక్కుంచుకోవాల్సిన అవసరం లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాన్ని పరిష్కరించి.. తగిన న్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.-కోదండరాం, తెజస అధ్యక్షుడు

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, సీసీఎం నేత కిల్లే గోపాల్‌, సీపీఐ నేత రామ్మోహన్‌, వివిధ సంఘాల నేతలు ఖలీల్‌, హనీఫ్‌ అహ్మద్‌, చంద్రశేఖర్‌, కిష్టన్న, బషీర్‌, ప్రభాకర్‌, బైరెడ్డి సతీశ్‌, నల్గొండ శ్రీధర్‌, ప్రకాశ్‌గౌడ్‌, నాగర్‌దొడ్డి వెంకట్రాములు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

'నదీ జలాల సాధన కోసం సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలి'

సంబంధిత కథనాలు..

Krishna Water Dispute : 'కృష్ణా వివాదంలో.. కేంద్రంగా నేరుగా ఎంటర్​ అవ్వొద్దు'

JAL SHAKTI MINISTRY: 'పార్లమెంటులో పెట్టే బిల్లులకంటే జాగ్రత్తగా గెజిట్‌ రూపొందించాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.