ETV Bharat / state

మిద్దె మీద విరాజిల్లుతున్న పచ్చదనం

ప్రస్తుత కాలంలో ఇంటిమీద మిద్దెలన్నీ దాదాపు ఖాళీగానే దర్శనమిస్తాయి. కానీ.. మిద్దె మీద తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు పండిస్తూ... ఆరోగ్యానికి ఆరోగ్యం... ఆహ్లాదానికి ఆహ్లాదం దక్కుతుందని నిరూపిస్తున్నారు పాలమూరు​కు చెందిన ఓ మహిళ. కేవలం 200 గజాల స్థలంలో తమ కుటుంబానికి కావాల్సిన కూరగాయలను పండిస్తున్నారు. స్లాబ్​పై పెంచిన 12 రకాల పూలమొక్కలు, పచ్చదనం ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సుమారుగా మూడేళ్ల నుంచి ఈ పద్ధతిని అవలంభిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్న లత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

author img

By

Published : Jul 18, 2019, 11:56 PM IST

విరాజిల్లుతున్న పచ్చదనం
విరాజిల్లుతున్న పచ్చదనం

అధికోత్పత్తి కోసం ఎరువులు, పురుగు మందుల వాడకం తీవ్రమైన నేటి రోజుల్లో సహజ సిద్ధంగా పండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు లభించడమే గగనమైపోయింది. క్రిమి సంహాకర మందుల అవశేషాలు.. ఆహారంలో నిల్వ ఉండటం వల్ల వాటి ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరల్ని తామే పండించుకోలేమా అని ఆలోచించారు మహబూబ్​నగర్ పట్టణానికి చెందిన గవిని లత దంపతులు.

200 గజాల్లోనే అంతా..

సుమారు 200 చదరపు గజాల్లో ఇంటిపై కప్పుపై ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు పండించాలని భావించారు గవిని లత. అనుకున్నదే తడవుగా సుమారు లక్షన్నర రూపాయలు వెచ్చించి మిద్దె మీద పెరటి తోటకు ఏర్పాట్లు చేశారు. స్లాబ్​కు ఆనకుండా అడుగు ఎత్తులో సిమెంట్​తో పెద్ద పెద్ద తొట్టెలను నిర్మించారు. కప్పుపై భారం పడకుండా పిల్లర్​, పిల్లర్​కు మధ్య భీంలపైనే ఈ తొట్టెలను నిర్మించారు. తొట్టెల్లో కంకర, ఎర్రమన్ను, పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని నింపారు. ఆ మట్టిలోనే విత్తనాలు వేసి మొక్కలను పెంచారు. మొక్కలకు పట్టే నీరు ఎప్పటికప్పుడు కిందకు ఇంకేలా, ఇంకిన నీరు నేరుగా.. ఇంకుడు గుంతలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇందువల్ల స్లాబ్​పై నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తీగజాతి కూరగాయలు పెంచేందుకు తీగలతో పందిళ్లు వేశారు. మూడేళ్లుగా ఇంటి మీద తమకు కావాల్సిన కూరగాయల్ని పండిస్తున్నారు.

మల్లెపువ్వు.. సొరకాయ.. దానిమ్మ

నలుగురు కుటుంబ సభ్యులకు కావాల్సిన స్వచ్ఛమైన తాజా ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. ప్రస్తుతం మల్లె, జాజిమల్లె, నందివర్ధనం, రాఖీ పువ్వు, గులాబీ లాంటి 12 రకాల పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఏ సీజన్​లో ఆ సీజన్​ పూలు పూస్తాయి. సొరకాయ, బీరకాయ, కాకరకాయ, వంకాయ, చిక్కుడు కాయ, టమాట లాంటి కాయగూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పూదినలాంటి ఆకు కూరలు ఇంటి పైకప్పుపైనే పండుతున్నాయి. సీజన్​ను బట్టి ఎప్పటికప్పుడు పంటల్ని మార్చుతారు. జామ, దానిమ్మ, డ్రాగన్, అంజీర, ద్రాక్ష లాంటి పండ్లు సైతం సీజన్​ను బట్టి అందుబాటులో ఉంటాయి. మార్కెట్​కు వెళ్లాల్సిన అవసరమే తమకు లేదంటున్నారు గవిని లత.

ఆరోగ్యం... వ్యాయామం.. ఒకే దగ్గర

రోజూ మొక్కలకు నీళ్లు పోస్తారు. ఇంట్లో తడి చెత్త, గుడ్లు, రవ్వ, టీ పొడి, కప్పుపై పేరుకుపోయి ఎండిపోయిన ఆకులు, అలముల్ని ఆ మొక్కలకు ఎరువులుగా వేస్తారు. పురుగు మందులు వాడరు. ఒక్కసారి ఖర్చు పెడితే జీవితాంతం ఎలాంటి ఖర్చు లేకుండా కూరగాయల్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు లత. పెరటితోట పెంచడం వల్ల శారీరకంగా వ్యాయామం కూడా అవుతోంది. అక్కరలేని పనుల కోసం సమయం కేటాయించడం కంటే ఆరోగ్యం కోసం రోజూ కొంత సమయం కేటాయిస్తే ఇంటి పైకప్పుపై పెరటి తోట పెంచడం చాలా సులువని సలహా ఇస్తున్నారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే...

ప్రభుత్వం సైతం కిచెన్ గార్డెన్​లకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టేందుకు మరింత మంది ముందుకొస్తారని అంటున్నారు లత దంపతులు.

ఇవీ చూడండి: మారోమారు మానవత్వం చాటిన కేటీఆర్​

Intro:.from
G.Gangadhar
jagityala
Cell:8008573563
......

నోట్.. సార్ స్క్రిప్ట్ లైన్లో పంపాను...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.